సర్వే చేయని పోడు భూములను పరిశీలించిన ఆర్.డి.ఒ

– అటవీ అధికారులను,సాగుదారుల విచారణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని ఆసుపాక, వాగొడ్డుగూడెం లలో సర్వే చేయని పోడు భూముల పై గురువారం ఆర్.డి.ఒ స్వర్ణలత, అశ్వారావుపేట ఇంచార్జి ఎఫ్.ఆర్.ఒ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. పోడు భూముల్లో సర్వే నిర్వహించి అర్హులైన సాగుదారులకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన నేపద్యంలో సర్వే చేయని వాగొడ్డుగూడెం సాగుదారుల ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఇదే విషయం అయి ఇటీవల అశ్వారావుపేట పర్యటనకు వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీపీఐ(యం) నాయకులు పుల్లయ్య నేతృత్వంలో మండలంలో సర్వే చేయని పోడు భూముల్లో సర్వే చేయించాలని వినతి పత్రం అందజేసారు. ఈ క్రమంలో ఆర్.డి.ఒ స్వర్ణ లత క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సాగుదారుల ఎంతమంది, ఎన్నేళ్ళుగా సాగులో ఉన్నారు? సర్వే చేయక పోవడానికి గల కారణాలను సాగుదారుల, అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదిక అందించాలని ఎఫ్.ఆర్.ఒ శ్రీనివాస్ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లూదర్ విల్సన్, ఎం.డి.ఒ శ్రీనివాస్ రావు లు ఉన్నారు.

 

Spread the love