తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. జూన్ నుంచి స్థానిక సంస్థల సమరం జరగనుంది. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీల దృష్టి వీటిపైనే ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలను సేకరించింది. పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తోంది.

Spread the love