4కె ఫార్మెట్‌లో రీ-రిలీజ్‌

Re-release in 4K format

బాలకృష్ణ, లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు కాంబి నేషన్‌లో రూపొంది సంచలన విజయం సాధించిన చిత్రం ‘భైరవద్వీపం’.
ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన ఈ చిత్రం 14 ఏప్రిల్‌ 1994న విడుదలైంది. రావి కొండల రావు రాసిన మ్యాజికల్‌ స్టోరీకి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అందించిన స్క్రీన్‌ప్లే, మాధవపెద్ది సురేష్‌ సంగీతం, కబీర్‌ లాల్‌ సినిమాటోగ్రఫీ, డి.రాజ గోపాల్‌ ఎడిటింగ్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చందమామ, విజయ కంబైన్స్‌ బ్యానర్‌ నిర్మాత బి. వెంకటరామి రెడ్డి నిర్మాణ విలువలు ప్రతి జనరేషన్‌ని ఆకట్టుకునేలా అత్యున్నత స్థాయిలో ఉండటం విశేసం. 9 నంది అవార్డులను సొంతం చేసుకున్న ఈ ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ని ఈ తరం ప్రేక్షకుల కోసం ఆగస్ట్‌ 5న 4కె క్వాలిటీతో క్లాప్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ రీ-రిలీజ్‌ చేస్తోంది. ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్‌ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని 4కెలో చంద్ర శేఖర్‌ కుమారస్వామి, క్లాప్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ పి.దేవ్‌ వర్మ రిలీజ్‌ చేస్తున్నారు.

Spread the love