కె.టి. కుంజుమోన్ నిర్మాతగా ఎస్.శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా, నగ్మ నటించిన నటించిన చిత్రం ‘ప్రేమికుడు’. ఈ సినిమా రీ-రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. ఘనంగా జరిగిన ఈ చిత్ర రీ రిలీజ్ వేడుకకు నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి హాజరయ్యారు.
’30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమాను మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ రిలీజ్ చేస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సహకరిస్తున్న మా డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాత కుంజుమోన్‌కి ధన్యవాదాలు’ అని చెప్పారు.