నవతెలంగాణ – హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చెయిన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో రియల్‌మీ 11 ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ బీ న్యూ స్టోర్‌లో గురువారం నటి వర్ష బొల్లమ్మ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. బజాజ్, టీవీఎస్ క్రెడిట్, హెచ్‌డీబీ, బీనౌ, క్లెవర్‌పే ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జీరో ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని బీ న్యూ స్టోర్ సీఎండీ బాలాజీ చౌదరి కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్‌తో పాటు రియల్‌మీ సౌతిండియా సేల్స్ హెడ్ వేణు మాధవ్‌లు పాల్గొన్నారు.