రికార్డు బద్దలుకొట్టారు.. IPL చరిత్రలో అత్యధిక స్కోర్

నవతెలంగాణ-
బెంగళూరు: హైదరాబాద్‌ జట్టు తన రికార్డును తానే బ్రేక్‌ చేసింది. బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో తనపై ఉన్న అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టింది. ట్రావిస్‌ హెడ్‌(102), క్లాసెన్‌(67), అభిషేక్‌(34), మార్‌క్రమ్‌(32*), సమద్‌(37*) పరుగులతో అదరగొట్టారు. బెంగళూరు బౌలర్లలో ఫెర్గుసన్‌ 2, టాప్లే ఒక వికెట్‌ పడగొట్టారు. ఈ సీజన్‌లోనే ముంబయిపై హైదరాబాద్‌ 277/3 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.
Spread the love