తాండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది నిరంతరం కృషి కషి చేస్తున్నారు. మాతా శిశు ఆస్పత్రిలో మహిళలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాన్పులు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఒక్కరోజులో 22 కాన్పులు చేయడం. మాత శిశు ఆస్పత్రిలో వైద్యులు ఒక్కరోజులో 22 కాన్పులు చేసి రికార్డు సృష్టంచారు. అందులో 18నార్మల్ డెలివరీలు, 4 సిజేరియన్ చేశారు. గతంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు.
నవతెలంగాణ-తాండూరు
వైద్యుల సేవలు అభినందనీయం
తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల సేవ లు అభినం దనీయం. తాండూర్‌లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గతం లో తాండూరు ఆస్పత్రికి వచ్చేందుకు భయపడిన ప్రజలు నేడు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలు కావాలని వైద్యం చేయించుకుంటు న్నారు. మాతా శిశు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది బాగా పనిచేసి రికార్డు స్థాయిలో కాన్పులు చేయడం అభినందనీయం.
– పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే
వైద్య సిబ్బంది కృషితోనే ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నాం
తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కృషి ఫలితంగానే నిరుపేదలకు మెరు గైన వైద్యం అందిస్తు న్నాం. రాష్ట్రంలో డెలివరీలో తాండూరు మాత శిశు ఆస్పత్రి మొదటి స్థానంలో నిలుస్తుం ది. ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీి ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటూ వైద్య సేవలు అందిస్తు న్నాం. మాతా శిశు ఆస్పత్రిలో సాధ్యమైనంత వరకూ నార్మల్ డెలివరీలు చేసేందుకు వైద్య సిబ్బంది కషి చేస్తున్నారు. తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేస్తున్నారు.
– డాక్టర్ రవిశంకర్, ఆస్పత్రి సూపరింటెండెంట్
ఒక్క రోజులోనే 22 కాన్పులు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మాతా శిశు ఆస్పత్రి వైద్యుల కృషికి అభినందనల వెల్లువ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు
పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ మాత శిశు ఆస్పత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడే గర్భిణీలు నేడు ప్రయివేట్‌కు వెళ్లకుండా నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందుతు న్నారు. మాతా శిశు ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతి గర్బిణీకీ నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చర్యలు తీసు కుంటున్నారు. తాండూర్‌లో వైద్యులు చేస్తున్న కృషికి ప్రజలు మాతా శిశు ఆస్పత్రికి క్యూ కడు తున్నారు. ప్రభుత్వం కూడా మాతా శిశు ఆస్పత్రికి కావాల్సిన సదుపాయాలను అందిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఎప్ప టికప్పుడు వైద్యుల్లతో మాట్లాడుతూ ఆస్పత్రికి కావా ల్సిన సదుపాయాలను సమకూర్చుతున్నారు. గతంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలంటే భయపడే ప్రజలు నేడు మాతా శిశు ఆస్పత్రి సేవలే మెరుగ్గా ఉన్నాయని కితాబు ఇస్తున్నారు.
కేంద్రంలోని మాత శిశు ఆస్పత్రిలో వైద్యులు చేస్తున్న కృషికి పలువురు నాయకులు, ప్రజలు అభి నందనలు తెలియజేస్తున్నారు. నిరుపేదలకు వై ద్యం అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అధికా రులు నిబద్దతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొం దుతున్నారు. మాతా శిశు ఆస్పత్రిలో వైద్యులు అంది స్తున్న వైద్య సేవలకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.