కశ్మీర్ లోయలో రికార్డు పోలింగ్..

నవతెలంగాణ-హైదరాబాద్ : కశ్మీర్ లోయలో పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటు నియోజకవర్గంలో 51.35% ఓటింగ్(సా.5గంటల వరకు) నమోదైనట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా శ్రీనగర్‌లో 38.49శాతం, బారాముల్లాలో 59.1% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. 2019లో ఈ మూడు చోట్ల సగటున 19.16శాతం పోలింగ్ నమోదైంది.

Spread the love