– భూదాన్ భూమిగా సర్కార్ గెజిట్ జారీ
– చేసిన భూములు పట్టాగా మార్పు
– మంకాల్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జా
– సుమారు రూ. 150 కోట్ల విలువ గల భూ రికార్డులో మార్పులు
– ప్రభుత్వ ఆధీóనంలో ఉండాల్సిన జాగాలు ప్రయివేటు వ్యక్తులు స్వాధీనం
– నిర్లక్ష్య ధోరణిలో రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు రెట్టింపు స్థాయిలో పెరగడంతో ఈ ప్రాంత భూములకు భలే డిమాండ్ పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పెట్టుబడిదారులు ప్రభుత్వ జాగాలపై కన్నేశారు. ఎక్కుడ సర్కారు భూమి కనిపింయినా దాన్ని మాయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇందుకు నిదర్శనం మహేశ్వరం మండల పరిధిలోని మంకాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 435లో 12.17 గుంటల భూమిని పట్టాదారు అయిన పక్కిర్ మహ్మద్ అనే వ్యక్తి 1979లో భూదాన్ బోర్డుకు ఇచ్చారు. ఈ భూమికి ప్రభుత్వం భూదాన్ భూమిగా గెజిట్ కూడా జారీ చేసేంది. అయితే ఈ భూమికి ఇరువైపులా ఉన్న భూస్వాములు ఈ భూమి కొట్టేసేందుకు రికార్డుల మార్పులు చేసి కొంత కాలం తమ పేర్లను సైతం రికార్డులో నమోదు చేయించుకున్నారు. 1986 నుంచి కొంత కాలం వరకు లక్ష్మినారాయణ, హరి కిషన్ పేర్లు పట్టాదారు కాలంలో నమోదు చేయిం చుకున్నారు. 1993-94లో శశికలరెడ్డి పేరును రికార్డులో నమోదు చేశారు. అయితే ఈ భూములు భూదాన్ భూములు ప్రయివేటు వ్యక్తు లు కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు మేరకు కొన్ని వార్త పత్రిక కథనాలు ప్రచురించడంతో 2011లో లోకయుక్త కోర్టు కేసును సు మోటగా తీసుకుని ఆ భూమి భూదాన్ భూమిగా గుర్తించింది. భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీ నం చేసుకోవాలని ఆర్డర్ చేసింది. అప్ప ట్లో అక్కడ ప్రభుత్వ బోర్డు కూడా పెట్టా రు. అనం తరం బోర్డును తొలగించిన వారిపై 2014లో స్థానిక తహసీల్దార్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. కానీ ప్రజా ప్రతినిధుల అండతో కేసు ముం దుకు వెళ్లని పరిస్థితి. దీంతో యథేచ్ఛగా ఆ భూములును అక్రమార్కులు కబ్జా పెట్టారు. దీనిపై నవతెలంగాణ ప్రతి నిధి.. స్థానిక తహసీల్దార్, ఆర్డీవోలను సంప్రదించగా అందుబాటులోకి రాలే దు. దీనిపై ఇటీవల స్థానికులు సైతం రెవెన్యూ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి ప్రభుత్వ భూ ములను కబ్జాదారుల నుంచి కాపాడాల ని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే.. ఆక్రమార్కులతో చేతులు కలిపితే.. ఇక ప్రభుత్వ జాగాలు కాపాడెదెవరు..! ‘ కంచె చేను మేసిన ‘ చందంగా సర్కారు భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు భూ బకాసురులతో చేతులు కలిపి రికార్డులు సైతం మార్పులు చేస్తూ ఉన్న ఫలంగా ప్రభుత్వ జాగాలు ప్రయివేటు పరం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసైన్డ్ భూములను పట్టా భూములుగా.. భూదాన్ భూములను పట్టా భూములుగా మారిపోతున్నాయి. ఇవి సామాన్యుడి కోసం జరుగుతున్న మార్పులు అనుకుంటే పొరపాటే. బడా పెట్టుబడిదారులు, వ్యాపారుల కోసం అధికారులు ఇదంతా చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నరన్నది ప్రశ్నార్థకంగా మారింది.