– అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని వావిలాల గ్రామపంచాయతీ రికార్డులను రోజు వారీగా పరిశీలించి నిర్వహణ తీరును మెరుగుపరచాలని మహబూబాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం గ్రామాలలోని మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో నెల్లికుదురు మండలంలోని వావిలాల గ్రామాన్ని సందర్శించి గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం, మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల, పాఠశాలలోని మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన పథకం, నర్సరీ, వైకుంఠధామం ల నిర్వహణ తీరును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డుల ను తనిఖీ చేశారు. టాక్స్ కలెక్షన్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.100% చేపట్టాలన్నారు. రికార్డులలో నమోదు వెంటనే చేయాలని జాప్యం తగదన్నారు. గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ్యం పనితీరును పెంచాలని అధికారులకు తెలియజేశారు. గ్రామంలోని మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల సందర్శించి అంగన్వాడీ కేంద్రం పనితీరును పరిశీలించారు. అనంతరం పాఠశాలలోనే ఒకటవ తరగతి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. మరుగుదొడ్లు మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాలను పరిశీలించి నర్సరీని సందర్శించారు నర్సరీ నిర్వహణ పెంచాలని నిర్వాహకులకు సూచించారు. ప్రక్కనే ఉన్న వైకుంఠధామం సందర్శించి దహన సంస్కారాలు కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు సిగ్రీ గేషన్ షెడ్ కు చేరుకొని చెత్త విభజనను పరిశీలించారు. సెగ్రీ గేషన్ షెడ్ లో చెత్త విభజన రోజువారీగా జరగాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషాద్రి, పంచాయతీ సెక్రెటరీ నాగజ్యోతి, మాజీ సర్పంచ్ బొల్లేపల్లి శ్రీనివాస్ ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు ఆయాలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.