నవతెలంగాణ – హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్‌కు 17 రోజుల ముందే నార్త్ అమెరికా అడ్వాన్స్ సేల్స్‌లో $1.05M దాటేసింది. దీంతో ట్రైలర్ కూడా రిలీజ్ అవకుండా అడ్వాన్స్ సేల్స్‌లో $1M మార్కును దాటిన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ నిలిచింది. కాగా ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ ఈవెంట్‌లో మూవీ నటీనటులందరూ పాల్గొనే అవకాశం ఉంది.