కోలుకున్న స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ భయాలతో నిన్న నష్టపోయిన మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, చమురు సరఫరాపై ఈ యుద్ధ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 567 పాయింట్లు లాభపడి 66,079కి చేరుకుంది. నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 19,690కి ఎగబాకింది.

Spread the love