12 సిరీస్‌లో రెడ్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్స్ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి తమ వినియోగదారును ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చైనా మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 12టీ ప్రో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. రెడ్‌మి నోట్ 12టీ ప్రో స్మార్ట్‌‌ఫోన్ ప్రారంభ ధర రూ. 19,000 నుంచి మొదలవుతోందని సంస్థ తెలిపింది. త్వరలో భారత మార్కెట్‌లో రెడ్‌మి 12 సిరీస్‌ ఫోన్లను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొత్త స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల పూర్తి స్థాయి హెచ్‌డీతోపాటు ఎల్సీడీ స్క్రీన్, 144హెచ్‌జెడ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా ఎస్‌వోసీ, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5,080ఎంఏహెచ్ బ్యాటరీ 67డబ్ల్యూ వైర్ ఛార్జింగ్ ఉంటుంది. రెడ్‌మి నోట్ 12టీ ప్రో స్మార్ట్‌‌ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 12టీ ప్రో స్మార్ట్‌‌ఫోన్ ప్రారంభ ధర రూ. 19,000 నుంచి మొదలవుతోంది. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 19,000 ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి నోట్ 12టీ ప్రో స్మార్ట్‌‌ఫోన్ రూ. 20,000 ఉంటుంది.

Spread the love