శ్రీశైలానికి తగ్గిన వరద..

Flood reduced in Srisailam..నవతెలంగాణ – శ్రీశైలం: ఎగువ నుంచి వరద తగ్గుతుండటంతో శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 86వేల 211 క్యూసెక్కులుండగా… ఔట్ ఫ్లో 2లక్షల 3వేల 523 క్యూసెక్కుల మేర కొనసాగుతోంది.   శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుత నీటిమట్టం 882 అడుగుల మేర కొనసాగుతోంది. అటు శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 TMCలుండగా..ప్రస్తుత నీటినిల్వ  202.96 టీఎంసీల మేర నమోదు అయింది.

Spread the love