అసత్య ఆరోపణలు సమంజసం కాదు: రేగ కళ్యాణి 

నవతెలంగాణ – గోవిందరావుపేట
మంత్రి సీతక్క పై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రేగ కళ్యాణి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూసీతక్క ని విమర్శించే స్థాయి, అర్హత ఎవరికి లేదనిగత ఇరవై యేండ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ లేని నాయకురాలు సీతక్క అని అన్నారు. ప్రజా సేవ తప్ప మరొకటి తెలియని నిస్వార్థ నాయకురాలు సీతక్క పై కావాలని కొందరు ప్రతి పక్ష నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనీ,సీతక్క పేరుని, కీర్తిని కించపరచడానికి కొందరు దుండగులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే ఆధారాలతో రండి చర్చకు మేము సిద్దం మీరు సిద్దం అయితే రండి అని సవాలు విసిరారు. అక్రమ ఇసుక రవాణా చేస్తూ లారీలు పట్టుబడ్డాయని అభియోగాలు చేస్తున్న ప్రతి పక్ష నేతలు రుజువులు ఉంటే ముందుకు రావాలని అంటున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా సీతక్క  మీద పీఏ సుజిత్ రెడ్డి  మీద ఆరోపణలు చేయడం నిజంగా దుర్మార్గం అని అన్నారు.  అవినీతి మచ్చ లేని, ఆదివాసీ అడవి బిడ్డ అని, అలాంటి గిరిజన బిడ్డ మీద కావాలని ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తాం అని, ఇప్పటికీ అయిన నిజాలు తెలుసుకుని మాట్లాడాలి కానీ నోటికి ఎంత వస్తె అంత మాట్లాడకూడదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేబోయిన సృజన, మండల మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చొప్పదండి వసంత, పులుసం లక్ష్మి, భవాని తదితర నాయకురాలు హాజరయ్యారు.
Spread the love