ఆత్మ చైర్మన్ కు పరామర్శ

నవతెలంగాణ – తాడ్వాయి
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల కేంద్రానికి చెందిన ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్యను వారి స్వగృహంలో శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడీషా నాగ రమేష్, ట్రస్ట్ సభ్యులు గురువారం సందర్శించి, పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య క్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షులు గౌరవబోయిన మోహన్ రావు, ట్రస్ట్ సభ్యులు బాడిశ ఆది నారాయణ, నవీన్, చౌలం వేణు, బోడ ప్రవీణ్, మునిగేల మహేష్, జానపట్ల జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love