నవతెలంగాణ – భువనగిరి రూరల్
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు కానీ రైతులు కానీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్ మాట్లాడుతూ గత 50 రోజులు గా రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డులో ఉంచిన ఇప్పటివరకు కొనుగోలు చేయడం పోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు పంట దిగుబడిపై అంచనా లేకపోవడం లేకపోవడమే నిర్లక్ష్యానికి కారణం చెప్పాలని సభలో నిలదీశారు. అధికారులు మాట్లాడుతూ ఏప్రిల్ 21వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొంత ఆలస్యం జరిగిందని, గత సీజన్లో కొనుగోలు చేసినవి మిల్లర్ల వద్ద ఉండడంతో కొంత ఆలస్యం జరిగిందని, లారీలో ధాన్యాన్ని అన్లోడ్ చేసే సందర్భంలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. ఇప్పటికీ 2 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా లక్ష మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కొంత ఆలోచన జరిగినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమంతం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ రైతులకు 142 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈసారి ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. జిల్లాలో కేవలం 37 మిల్లులు మాత్రమే ఉన్నాయన్నారు. 400 లారీలతో ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దని ఎవరైనా డబ్బులు అడుగుతే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బస్వాపురం రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న లప్ప నాయక్ తండ శుక్లా నాయక్ తండ వారికి నష్టపరిహారం చెల్లించాలని డాక్టర్ నగేష్ కోరగా , అధికారులు మాట్లాడుతూ లపా నాయక్ తండకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించినట్లు, సోక్ల నాయక్ తండాకు సంబంధించి ప్రాసెస్ లో ఉన్నట్లు తెలిపారు. ఆలేరు ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ నీటిలో కోడి ఈకలు వస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు మాట్లాడుతూ ఇదంతా దృశప్రచారమని , అలాంటిదేమీ లేదని స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. నందన గ్రామంలో ఏర్పాటు చేసిన నీరా ప్రాజెక్టులో ఎలాంటి ఉత్పత్తులు ఉంటాయని అడిగారు. ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ నవీన్ కుమార్ మాట్లాడుతూ నీల తో పాటుగా, పటిక బెల్లం, చాక్లెట్లు తయారు చేసే అవకాశం ఉందన్నారు. మిషన్ ఇది వచ్చినట్లు నెల రోజుల్లో నీరా ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ , యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం లు మాట్లాడుతూ గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ఉదయం ఐదు గంటలకే బెల్ట్ షాపులు తెరవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్టలో మద్యానికి బానిసై ఇటీవలనే ఇద్దరు యువకులు చనిపోయినట్లు తెలిపారు. చౌటుప్పల్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిసవుతుందని, డ్రగ్స్ ను నిరోధిస్తూ, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి వనరులను వృద్ధి చెంది అత్యధికంగా పంట దిగుబడి తీసుకు వచ్చిందన్నారు. రైతులు ఒకేసారి కాకుండా విడుదలవారీగా వ్యవసాయ పంటలను పండించాలని కోరారు. ప్రత్యమాయ పంటలపై దృష్టి సాధించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ డిఎం గత నాలుగు సంవత్సరాలుగా సమావేశానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎజెండాకు సంబంధించిన అంశాలు తీసుకురాకపోవడంతో వారికి మెమో జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ విత్తన డీలర్ల నుంచి అధికారుల వరకు వరి ధాన్యానికి సంబంధించిన హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుత మిల్లర్లు తరుగు పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారని, పరుగు రావడానికి కారణం హైబ్రిడ్ రకం దాన్యాలు పండించడమే కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జెడ్పి సిఈఓ సిహెచ్ కృష్ణారెడ్డి, జడ్పిటిసిలు సూబ్బురు భీరు మల్లయ్య తోటకూర అనురాధ, శ్రీరాముల జ్యోతి, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా అధికారులు సునంద, లక్ష్మణ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్యాంసుందర్, అన్నపూర్ణ , జైపాల్ రెడ్డి తోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.