వరకట్నం వేధింపుల కేసు నమోదు..

నవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలోని పసర పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేధింపుల కేసు నమోదైనట్లు ఎస్ఐసిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు. ఎస్ఐసిహెచ్ కరుణాకర్ రావు కదన ప్రకారం మండలంలోని పసర గ్రామానికి చెందిన ఎడ్ల స్వాతి కి వెంకటరెడ్డి తో గత 29 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో స్వాతి తల్లిదండ్రులు కట్నకానుకలుగా రెండు ఎకరాల పొలము లక్ష రూపాయల నగదు అర తులం బంగారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్వాతికి పిల్లలు కలగకపోవడంతో గత కొంతకాలంగా భర్త వెంకట్ రెడ్డి తో పాటు అత్తమామలైన ఎడ్ల అంజిరెడ్డి సూరమ్మలు వేధింపులకు గురి చేస్తున్నారని స్వాతి ఫిర్యాదులు పేర్కొంది. పిల్లలు లేకపోవడం మరో వివాహం చేసుకోకుండా ఉండాలంటే అదనపు కట్నం కావాలని భర్త అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారన్న స్వాతి  ఫిర్యాదు మేరకు సెక్షన్ 498 కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
Spread the love