నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 137 ప్రైవేటు కళాశాలల్లో 80,091 సీట్లు భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 సీట్లు, రెండు ప్రైవేట్ వర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అత్యధికంగా సీఎస్‌ఈలో 15,897, ఈసీఈలో 9,734 సీట్లు ఉన్నట్లు తెలిపింది.