అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల  రెగ్యులర్ కళా సఫలం అయ్యేదేన్నడు..

మోకాళ్ళ పై కూర్చొని నిరసన..
నవతెలంగాణ- డిచ్ పల్లి

తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 14 వ అందోళనలో బాగంగా గురువారం తెలంగాణ యూనివర్సిటీ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మోకాళ్ళ పై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ కళా సఫలం అయ్యేదేన్నడని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రశ్నించారు. కెసిఅర్ ప్రకటనలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడం  శోచనీయమని, గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేసి యూనివర్సిటీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను  రెగ్యులర్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా చుసే భద్యత సిఎం కెసిఆర్ పై ఉందన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే వచ్చేనెల ఏడవ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో రవీందర్ నాయక్, సాయి, అసీఫ్, రామకృష్ణ , మధులిక, ప్రేమ్ కుమార్,   గంగాధర్, నవ్య, మౌనిక, మంజుల, సవిత, సిత, సునీత, గులాబ్, సాయి విజయ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love