నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి ఎస్. బాలకృష్ణ అరెస్టు అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఏసీబీ నిర్వహించిన దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఆయన గతంలో హెచ్ఏండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరోవైపు ఎంఏయూడీ (పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం)లో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గానూ కొనసాగారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు.