పదవ తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది . చివ్వేంల మండల కేంద్రం తో పాటు, తిరుమలగిరి (జి )లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు.. ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు కొనసాగనుండగా గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. పదవ తరగతి పరీక్షలకు గాను చివ్వేంల జడ్పీహెచ్ఎస్ హైస్కూలు సెంటర్ లో 198 మంది విద్యార్థులు పరీక్ష రాశారు . అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమల గిరి (జి ) లో 114 మంది విద్యార్థులకు గాను 111పరీక్ష రాశారు.ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. మొత్తం 312మంది విద్యార్థులకు గాను 309మంది విద్యార్థులు పరీక్ష రాశారు . పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంఈఓ గోపాల్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.