‘ఇందిరమ్మ రాజ్యం…. ఇంటింటా సౌభాగ్యం’… కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

నవతెలంగాణ హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు-2024కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం…. ఇంటింటా సౌభాగ్యం’ పేరిట విడుదల చేసింది. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేసినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందులో 23 అంశాలు చేర్చినట్టు ఆయన వివరించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు.. ప్రతి గడపకు మ్యానిఫెస్టోను తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలు
1. హైదరాబాద్ మహా నగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్‌ పునఃప్రారంభం.
2. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం..
a) కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,
b) బయ్యారంలో ఉక్కు కర్మాగారం,
c) హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)
d) హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనుండి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ.
e) యువత కోసం వివిధ యూనివర్సిటీలు… మైనింగ్ విశ్వవిద్యాలయం
f) మేడారం జాతరకు జాతీయ హోదా
g) హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు
h) ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం
i) పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా
j) నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంపు

Spread the love