మేడారం జాతరకు లక్నవరం నీటి విడుదల

– ఏఈ ఆర్షద్ లక్నవరం చెరువు
నవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతరకు భక్తుల స్నానాలకై లక్నవరం నీటిని విడుదల చేయడం జరిగిందని ఏఈ అర్షద్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్షద్ మాట్లాడుతూ.. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి ప్రతి జాతరకు లక్నవరం నీటిని విడుదల చేయడంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేదు లక్నవరం నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా లక్నవరం చెరువు తూముల నుండి నీటిని సద్దిమడుగు ప్రాంతంలో గేజ్ పూర్తి చేసి తద్వారా దయ్యాలవాగు ద్వార జంపన్న వాగు కు నీటి విడుదల చేయడం జరిగిందని అన్నారు. మేడారం భక్తులు వాగులో తగు జాగ్రత్తలు చేపడుతూ స్నానాలు ఆచరించాలని సూచించారు. లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా కుటుంబ సభ్యులను పిల్లలను వెళ్ళనీయకుండా జాగ్రత్తతో స్నానాలు ఆచరించాలని సూచించారు.
Spread the love