గురుకుల డిగ్రీ కాలేజీల భర్తీకి సెకండ్ లిస్టు విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మెరిట్ ప్రకారం సీట్ల భర్తీకి రెండో జాబితా విడుదల చేశామని టీజీఆర్ డీసీ సెట్ –2024 కన్వీనర్ బడుగు సైదులు గురువారం ఓ ప్రకటనలో ప్రకటించారు. సీట్ల కేటాయింపు వివరాలు https://tgrdccet.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సీట్లు కేటాయించబడిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోగా సంబంధిత కాలేజీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, కోర్సులు ఉండగా, ప్రతి కోర్స్ లో 40 సీట్లు ఉన్నాయని వెల్లడించారు.

Spread the love