హీరో విశాల్ ‘మార్క్ ఆంటోనీ’గా మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న చిత్రం విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్‌గా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్త రెట్రో లుక్ తో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. అలాగే ఇటీవల రిలీజైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించారు. గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ లుక్, ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మార్క్ ఆంటోనీ టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రం ఆద్యంతం అందరినీ అలరించనుంది అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్, నిర్మాత: ఎస్.వినోద్ కుమార్, సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్, డి.ఓ.పి: అభినందన్ రామానుజం, ఎడిటర్: విజరు వేలుకుట్టి.