తీవ్ర తుపానుగా మారిన రెమాల్‌…

Cyclone Remalనవతెలంగాణ – హైదరాబాద్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్‌, నాగాలాండ్‌, అసోం, మేఘాలయ, అండమాన్‌ నికోబర్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Spread the love