భూమి కోసం హత్య చేసిన నిందితుల రిమాండ్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
గత నాలుగు రోజుల క్రితం డిచ్ పల్లి మండల కేంద్రంలోని సిఎండి దగ్గర హత్య చేసిన మృతుడు ఇందల్ వాయి మండలంలోని మేఘ్యనాయాక్ తండాకూ చెందినా లకవత్ వెంగల్ 37 హత్య చేసిన ముగ్గురు నిందుతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్, ఇందల్ వాయి ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..ఇందల్ వాయి మండలంలోని మేగ్యనాయక్ తాండకు చెందిన లకావత్ వెంగల్ కు సంబంధించిన భూమిని  అతని బందువులు అయిన లకవత్ బిజ్జు @ బిజన్ మామ పేరు పైన ఉన్న భూమి కలిపి ధరణి లో బాగంగా కొత్త పట్టా పాస్ బుక్ బిజు  మామ పేరు మీద వచ్చినందున,అ భూమికి సంబందించిన రుణమాపి మరియు రైతు బందు డబ్బులు బిజ్జు తీసుకుంటున్నది. ఈ విషయం లో మృతుడు నిందితురాలు అయిన బిజ్జు ని, ఆమె కొడుకుని తన కు చెందినా భూమిని తన పేరున పట్టా పాస్ బుక్ మార్పించాలని గత కొన్ని రోజులుగా అడుగుతున్నాడని వివరించారు. అయితే అతన్ని చంపేస్తే భూమి తమకే దక్కుతుందని బావించి లకవత్ బిజు @ బిజన్, ఆమె కొడుకు లకవత్ అనిల్ లు, అదే తండాకు చెందినా బనవాత్ బిక్యకు సుపారి ఇస్తామని మాట్లాడుకుని అతన్ని పురుమాయించగ బనవాత్ భిక్య 06 న డిచ్ పల్లి మండలం లోని సీఎంసీ పరిసర నిర్మానుష్య ప్రాంతాల్లోకి లకవత్ వెంగల్ ని తీసుకువెళ్ళి నమ్మించి మద్యం త్రాగించి దారుణంగా హత్యా చేయించినట్లు  సిఐ మల్లేష్ పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో బాగంగా డిచ్ పల్లి సిఐ నిందితులు ముగ్గురుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
Spread the love