
మండలంలోని చిక్లి గ్రామంలో పాత కక్ష్యలతో హత్య చేసిన నిందితులకు మంగళవారం రిమాండ్ చేసినట్లు నిజామాబాద్ నార్త్ రూరల్ సీ.ఐ బి. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 13 న చిక్లి గ్రామంలోని సొసైటీ గోదాం దగ్గర ర్యాపని చిన్న గంగారం (48) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో డి కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతుడు ర్యాపని చిన్న గంగారాం , ఏ2- నిందితుడు ఎడగొట్టి ప్రసాద్ కు సంబందాలు లేవు. మృతునికి ఉన్న అప్పుల కారణంగా, అతనికి ఉన్న వ్యవసాయ భూమిని అమ్మకానికి పెట్టగా, ఏ1 -కారం నవీన్ (33) దానిని ఏ2 ప్రసాద్ (34). చెప్పిన విదంగా, సమకూర్చినటువంటి డబ్బులతో కారం నవీన్ తన బావ నీరడి ముత్తెన్న పేరు మీద కొని, అసైన్మెంట్ భూమి అయినందున బాండ్ పేపర్ రాసుకునే క్రమంలో ఏ1 – కారం నవీన్, ఏ2- ప్రసాద తరపున భూమి కొంటున్న విషయం తెలుసుకున్న మృతుడు కారం నవీన్ తో వాదించి, బాండ్ పేపర్ రాశి ఇవ్వకుండా కారం నవీన్ తో గొడవ పడినాడు. అప్పటి నుండి కారం నవీన్ అట్టి భూమిని తన అదినంలో ఉంచుకుని పంట పండించుకోగ, కోత సమయంలో మృతుడు అట్టి పంటను నాశనం చేసేవాడు. ఇదే విషయం ఊరి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిన పరిష్కారం కాలేదు. కారం నవీన్ యొక్క వ్యక్తి గత విషయాల గురించి, మృతుడు ఊరి పెద్దల ముందట అడ్డాల దగ్గర కించపరిచే విదంగా మాట్లాడి పరువు తీశాడు. దింతో కారం నవీన్, ప్రసాద్ యొక్క ప్రోత్సాహంతో ఈ నెల 13 వ తేదీన మృతుడు, కారం నవీన్ తో గొడవ పడి అడ్డగించాడు. అదే రోజు పెద్దల సమక్షంలో భూమి విషయం సొసైటీ ముందర మాట్లాడుతున్న సమయంలో కారం నవీన్ మృతున్ని చంపాలనే ఉద్దేశంతో తన యొక్క ట్రాక్టర్ తో మృతుడి ని డీ కొట్టి అతని మరణానికి కారణం అయ్యాడు. నేరం నందు ఉపయోగించిన ట్రాక్టర్ ను స్వాధీనపరుచుకొని నిందితులను రిమాండ్ కు తరలించారు. కేసు చేధనలొ కీలక పాత్ర పోషించిన సి.ఐ బి. శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సిబ్బందిని అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ ఎల్.రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.