యోగాతో మానసిక ఒత్తిడి దూరం

నవతెలంగాణ – చిన్నకోడూరు
క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల మానసికంగా ఒత్తిడిని జయించవచ్చని యోగా శిక్షకుడు, పాఠశాల ఉపాధ్యాయులు దేవదాస్ అన్నారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల యందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో యోగా సాధన చేయించారు. యోగ సాధన చేయడం వల్ల మానసికంగా శారీరకంగా వృద్ధుని వికాసాన్ని పొందుతారని అన్నారు విద్యార్థి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్య యందు శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతుందని ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండడానికి అనారోగ్య సమస్యలు రాకుండా యోగ ఉపయోగపడుతుందన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవయ్య, ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love