కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనుచరుడు రెండ్ల నరేష్ దారుణ హత్య

నవతెలంగాణ – ధర్మారం
మండలంలోని కటికనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు రెండ్ల నరేష్ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర గాయాలైన నరేష్ ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేష్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం రాత్రి కటికనపల్లి గ్రామానికి చెందిన రేండ్ల నరేష్ (40) అదే గ్రామానికి చెందిన కాజా మాజీ సర్పంచ్ కారుపాకల రాజయ్య , అతని కుమారులు కారుపాకల కుమార్, కారుపాకల వెంకటేష్, లను గత కొన్ని సంవత్సరంల నుండి రెండ్ల నరేష్ గ్రామ అభివృద్ధి విషయాల కోసం నిలదీస్తూ ఉండేవాడు ఈమధ్య సిసి రోడ్ల విషయంలలో ఇబ్బందులకు గురి చేశాడని అప్పటినుండి వీరు ముగ్గురు కలిసి రెండుల నరేష్ ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు ఇట్టి విషయం అదే గ్రామానికి చెందిన బోనగిరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పాఠకుల బుచ్చి రాములు, జంగిలి చిన్న రవి లకు చెప్పగా వారు కూడా హత్యకు సహాయం చేస్తామని కుట్ర పన్నారు గత రెండు నెలల క్రితం రేండ్ల నరేష్ కారుపాకల రాజయ్య కుటుంబ సభ్యులపై చామన పెళ్లికి చెందిన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ఒక భూమి విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడు అనే అనుమానంతో కారు పాకల రాజయ్య అతని కొడుకులు రెండ్ల నరేష్ పై మరింత కోపం పెంచుకొని అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు.

అదే క్రమంలో గత కొన్ని రోజుల క్రితం నుండి కారుపాకల రాజయ్య సూచనల మేరకు ఒక పథకం ప్రకారంగా రాజయ్య తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి హైదరాబాదు లోని దవఖానాలో ఉండి పై ఐదుగురికి మీరు నరేష్ ని చంపి వేయండి ఏదైనా అయితే నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఈనెల 2 ఆదివారం రోజున కారుపాకల కుమార్, శ్రీనివాస్, వెంకటేష్ , మరో మాజీ సర్పంచ్ బాటకుల బుచ్చి రాములు, చిన్న రవి, లు కలసి ఆదివారం రాత్రి నరేష్ ను అంతం చేయాలనే పథకం పని కుట్రతో రాజారాం పల్లి వైన్స్ లో మద్యం సేవించి నరేష్ ని ఈరోజు ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారంగా బుచ్చి రాములు, చెంగిలి చిన్న రవి వెళ్లి నరేష్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి నారు. తర్వాత వెంకటేష్ ఇక్కడే ఉంటే అతడిపై అనుమానం వస్తుంది అని అతడు తన తండ్రి వద్దకు వెళ్ళినాడు. వీరి పథకం ప్రకారం గా కుమార్ మరియు శ్రీనివాస్ లు బైక్ పై నరేష్ కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి వద్ద గల కిరాయి గది వద్దకు వెళ్లి కుమార్ లోపలికి వెళ్లి నరేష్ ను చేతులతో మరియు అక్కడే గల ఒక పారతో ఛాతిపై చేతులపై ఇష్టం వచ్చినట్టుగా కొట్టినాడు తర్వాత శ్రీనివాస్ లోపలికి వెళ్లి అదే పార తీసుకొని నరేష్ తలపై విచక్షణ రహితంగా కొట్టగా నరేష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయినాడు. నరేష్ చనిపోయినాడు అనుకొని వీరిద్దరూ బుచ్చి రాములు ఇంటికి వెళ్ళి నరేష్ నరేష్ చనిపోయాడని సంబరాలు జరుపుకున్నారు మృతుడి తమ్ముడు రెండ్ల సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్ల  ఎస్సై టీ సత్యనారాయణ తెలిపారు.

Spread the love