గ్రామీణ ప్రాంత ఆలయాలను పునరుద్దరించండి..

– దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఎమ్మెల్యే మెచ్చా వినతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
తన నియోజక వర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల దేవాలయాలను పునరుద్ధరించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని శుక్రవారం హైద్రాబాద్ నూతన సచివాలయం లో ఆయన ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కోరారు. అశ్వారావుపేట నియోజక వర్గంలోని చండ్రుగొండ మండలం రావికం పాడు లో నూతన దేవాలయం నిర్మించాలని,దమ్మపేట మండలం కేంద్రంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని,అన్నపురెడ్డిపల్లి,ములకలపల్లి మండలాల్లోని పురాతన దేవాలయాలను పునరుద్ధరించాలని,ఈ మండలాల్లో ఆలయ మాన్యాలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేసారు. సానుకూలంగా స్పందించిన ఆయన నూతన దేవాలయాలు నిర్మాణానికి,పురాతన దేవాలయాలు పునరుద్దరణకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రముఖులు దారా బాబు,నల్లమోతు వెంకటనారాయణ,కుక్కల శ్రీను,ఇనుమల స్వామి తదితరులు ఉన్నారు.

Spread the love