హేమలత లవణంగా రేణు దేశాయ్

Renu Desai as Hemalatha Lavanaరవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఈనెల 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రేణు దేశాయ్ ఫస్ట్‌ లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు మేకర్స్‌.
ఈ చిత్రంలో హేమలత లవణం అనే స్ఫూర్తిదాయక మైన పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతున్నారు. ఓ పసిబిడ్డని లాలిస్తున్నట్టు కనిపిస్తున్న రేణుదేశాయ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది.ఈనెల 3న ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్‌. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు చార్ట్‌ బస్టర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వంశీ, నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌, సమర్పణ: తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌, సహ నిర్మాత: మయాంక్‌ సింఘానియా,
డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా, డీవోపీ: ఆర్‌ మదీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా.

Spread the love