నెట్ నిర్వాహకులు వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి-ఎస్ఐ

నవతెలంగాణ- భిక్కనూర్
ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తానని డబ్బులు వసూలు చేసి వినియోగదారులకు కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. భిక్కనూర్ మండలంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి కనెక్షన్ ఇవ్వకుండా వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం అందిందని ఎవరైనా ఫిర్యాదు ఇస్తే సంబంధిత ఇంటర్నెట్ కనెక్షన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డబ్బులు వసూలు చేసిన ఇంటర్నెట్ కనెక్షన్ నిర్వాహకులు వినియోగదారులకు ఇబ్బందులకు గురి చేయవద్దని పోలీసులు సూచించారు.
Spread the love