నవతెలంగాణ-చెన్నారావుపేట
గతంలో డబ్బులుపెట్టి కొ న్నభూమి,వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు వ్యక్తులు కలిసి అక్రమంగా పట్టా చేయిం చుకున్నారని ఆరోపిస్తూ చెన్నారావుపేట మండలం పుల్లయ్యబో డుతండా గ్రామ పరిధిలోని అజ్మీర తండా వాసులు నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వ హించి, మా భూమి మాకు ఇప్పించి న్యాయం చేయాలంటూ తహశీ ల్దార్ బన్సీ లాల్‌కు లిఖితపూర్వమైన నివేదిక అందజేశారు. వివరాల్లోకి వెళ్తే అజ్మీర తండాకు చెందిన దేవ్ సింగ్, బాలాజీ, స్వామి, రాజు, రెడ్యా, బిక్యా అను వ్యక్తులు కలిసి బానోతు భోజ్యా, చందా, కిషన్, రవి, వెంకన్న, చిన్న, రాము, లచ్చు, వాల్య, కిషన్, రాజు, సంధ్యలకు కొంత భూమిని డబ్బులకు అమ్ముకున్నారు. అమ్మిన దాంట్లో తలో కొంత పట్టా చేయించి మరికొంత భూమిని దేవ్ సింగ్ తన భార్య పేరు మీద, స్వామిల పేరు మీద పట్టా చేయించుకుని అట్టి భూమికి రైతు బంధు, పంట రుణాలు అనుభవిస్తున్నారని అన్నారు. ధరణి కంటే ముందు సాదా బైనామ లు ఉన్నప్పుడు మనిషికి రూ.10 వేలు, ఫోటోలు, పహాణీలు తీసుకుని సదరు వ్య క్తులు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అజ్మీరతండాలో ఇంటిస్థలాలు, వ్యవసాయ భూమి కలిపి దాదాపు 8 ఎకరాల భూమి వరకు కబ్జా అయినట్లు వారు ఆరోపిస్తున్నారు. తహశీల్దార్ స్పందించి విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో రమేష్, రవి, కిషన్, బాలి, మంజుల,సుగుణ,అఖిల్,చందా,మల్లి, భోజ్యా, ఈ ర్యా, కౌసల్య, వినోద, తదితరులు పాల్గొన్నారు.