– ఆయిల్ఫెడ్ ఎం.డి సురేందర్ తో భేటి అయిన రైతుసంఘం నాయకులు జూలకంటి రంగారెడ్డి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 13 న అశ్వారావుపేట లో జరగనున్న ఆయిల్ ఫాం సాగుదారుల రాష్ట్ర స్థాయి సదస్సులో భాగంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి కి వినతి పత్రం అందజేసారు. మంగళవారం హైద్రాబాద్ లోని ఆయిల్ఫెడ్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయిల్ఫెడ్ ఎండి సురేందర్ భేటీ అయ్యారు. వీరి వెంట నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,అన్నవరపు సత్యనారాయణ లు ఉన్నారు.