సమస్యలు పరిష్కరించాలని వినతి

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఏరియాస్పత్రికి వచ్చిన వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ కేవీరమేష్‌కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఎం.సోమమల్లయ్య, జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.పరాబ్‌కుమార్‌ మాట్లాడారు.వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులందరికీ ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించాలన్నారు.వైద్య విధాన పరిషత్‌లోని 19 మెడికల్‌ కళాశాలలో అభిగ్రేడ్‌ చేయబడినందున అందులో పనిచేస్తున్న టీవీ వీవీపీ ఉద్యోగులకు కలిపి పోస్టులలో రియల్‌ స్ట్రక్చర్‌ చేయాలని కోరారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో పడగల సంఖ్య పెంచాలన్నారు.వైద్య విధాన పరిషత్‌లోకి వచ్చిన వైద్యశాల సిబ్బందిని కేటాయించాలన్నారు. వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టర్‌ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు. వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న డాక్టర్లకు ఇచ్చిన విధంగా డీఎంఈ పరిధిలో గల మెడికల్‌ కాలేజీలు,ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరి ఉద్యోగులకు అబ్జర్వేషన్‌ ఆప్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.317 జీవో అమలుపరుస్తూ లోకల్‌ కేడర్‌ నిర్దారిస్తూ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్‌ ఇవ్వాలని కోరారు.వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న పదోన్నతులు లేని కేటగిరి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.ఎంఎస్‌సీ నర్సింగ్‌ చేసిన వారికి కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ ఉద్యోగాలలో భర్తీ చేయాలన్నారు.ఇటీవల కొత్తగా ఉద్యోగంలో చేరిన ఏఎన్‌ఎంల వలన 20 ఏండ్ల నుండి పనిచేస్తున్న డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఏఎన్‌ఎం లను ఉద్యోగం నుండి తీసివేస్తున్నారని కోర్టు సూచన ప్రకారం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు ఈ సమస్యల గురించి ప్రిన్సిపల్‌ కార్యదర్శి గతంలో ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు ఎ.సత్తయ్య, పి.పుష్ప, వెంకటరమణ,జేఏసీ జిల్లా సభ్యులు విజయరాణి, జే బుజ్జి, నాగశేషమ్మ,సునీత, హైమావతి,హేమలత పాల్గొన్నారు.

Spread the love