అక్రమంగా రాత్రీ పూట వాగు తరలిస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలని వినతి

నవతెలంగాణ – జుక్కల్

అక్రమంగా   రాత్రీ   వేళ  అక్రమదారులు  వాగు నుండి తరలిస్తున్నారని  పడంపల్లి గ్రామరైతు  సందీప్ పటేల్  తరలిస్తున్న వారిపైన చర్యలు  చేపట్టాలని  కోరుతు జుక్కల్ తహసీల్దార్ హిమ బిందుకు  మండలంలోని పడంపల్లి గ్రామానికి చెందిన రైతు శుక్రవారం నాడు  ఫీర్యాదు చేయడం జర్గింది. ఈ సంధర్భంగా రైతు సందీప్ పటేల్ మాట్లాడుతు గత కొన్ని నెలలుగా వ్వవసాయక్షేత్రం పక్కనే ఉన్న పెద్ద ఎడ్గి వాగు నుండి రాత్రీ పూట గుర్తు తెలియని వ్యక్తులు నిత్యం దొడ్డు ఇసుకను తరలిస్తున్నారని పలు మార్లు తహసీల్దార్ కు ఓరల్ గా తెలియచేసిన పట్టించుకోవడం లేదని ,  అందుకే  వ్రాతపూర్వకంగా  ఫిర్యాదు చేసానని,   ఇసుక తరలించడం వలన వ్వవసాయ భూమీ లోని మట్టి వర్షాలు పెద్దగా పడినప్పుడు మట్టి కొట్టుకొని వ్వవసాయ భూమీ కోతకు గురి అవుతోందని, నష్టం వాటిల్లుకుందని ఫిర్యాదు పత్రంలో రైతు తెలియచేసారు. ఇప్పడికైన రివేన్యు శాఖ నిద్రమత్తు విడిచి సామన్య రైతుల సమస్యల పరిష్కారం కోరకు చర్యలకు ఉపక్రమిస్తారా లేదా ఇనేది కాలం నిర్ణయం చేస్తుంది, వేచి చూద్దాం.
Spread the love