ప్రభుత్వ భూములు కాపాడాలని తహాసీల్దార్ కు వినతి

నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వ భూములు కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ అనితా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిగ్లీ పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూమి, ఇతర ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని రియల్ వ్యాపారాలు చేస్తున్న పనులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గోరెంకల నర్సింహ,గుండె శివ కుమార్,, ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love