‘ఈత చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతి’

నవతెలంగాణ-మర్పల్లి
మర్పల్లి మండలం గ్రామంలోని కొంషట్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 55,56,57, 58ల్లో ఈత చెట్లు నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గీత కార్మికుల ఆధ్వర్యంలో మంగళ వారం మర్పల్లి తహసీ ల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈడిగి నాయబ్‌గౌడ్‌ వృతి గీతకార్మికుడు, మర్పల్లి మండలం సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన కొంషట్‌పల్లి గ్రామంలోని ఈ సర్వే నెంబర్లలో తేదీ 28-5-2023న భూమి యజమాని సదాశివపేటకు చెందిన ఆయన బజాజ్‌ పవన్‌ అనే వ్యక్తి 500 వరకు ఈత చెట్లను జేసీబీ సహాయంతో తవ్విన గుంతలు కప్పి వేశారని వారు తెలిపారు. ఈ చెట్లను తొలగించడంతో గీతా కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈత చెట్లను ప్రతిష్టాత్మకంగా పెంచుతుంటే భూ యజమానులు ఈత చెట్లను నరికి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈత చెట్లను సంరక్షించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు, ఎక్సైజ్‌ సిబ్బందికి గీతకార్మికులు కోరారు.

Spread the love