సురేష్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన రాజీవ్‌ గృహకల్ప వాసులు

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
మాజీ కార్పొరేటర్‌ సురేష్‌ రెడ్డిని 130 డివిజన్‌ కార్పొరేటర్‌ కార్యాలయం వద్ద రాజీవ్‌ గహకల్ప వాసులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేగా కేపీ వివేకానంద భారీ మెజారిటీతో గెలవటం అంటే వారి పనితనానికి ప్రజల బ్రహ్మరథం పట్టారన్నారు అన్నారు. ఎమ్మెల్యే వివేక్‌ ఉదయం 7గంటల నుండి రాత్రి 10గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశారని ఆ పనుల ఫలితమే మూడో సారి హ్యాట్రిక్‌ విజయం అన్నారు. ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సాధకాలు, బాధకాలు, కష్టాలు, నష్టాలు, బాధల్లో ఎమ్మెల్యే వివేకానంద తోడు ఉన్నారని ఈ సందర్భంగా సురేష్‌ రెడ్డి గుర్తు చేశారు. ఆసేవలు గుర్తుంచుకున్న కుత్బుల్లాపూర్‌ ప్రజలు మూడో సారి రాష్ట్ర టాపర్‌గా 85,576 ఓట్లు మెజారిటీతో గెలుపు తిలకం దిద్దరిని తెలిపారు. ఎమ్మెల్యే సారధ్యంలో కార్పొరేటర్లు ప్రజలకు సేవ చేయటం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేకు గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు,నాయకుడికి, ప్రజా బంధువులకు, ప్రజా ప్రతినిధులకు, తన డివిజన్‌ ప్రజలకు మాజీ కార్పొరేటర్‌ సురేష్‌ రెడ్డి ధన్యవా దములు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూరారం రాజీవ్‌ గహకల్ప అధ్యక్షుడు శివ గౌడ్‌ ఆధ్వర్యంలో రేఖ, సంధ్యా వారి మిత్రబందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love