నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లతో పాటు, ఎస్సి కాలనిలో ఎక్కువగా “తాడిచెర్ల విష జ్వరాలు” అనే కథనానికి మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి రాజు, పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం,పారిశుధ్య చర్యలు,ఇంటింటా పివర్ సర్వే సోమవారం చేపట్టారు. వైద్య శిబిరంలో 36 ఒపి, ఇంటింటా పివర్ సర్వేలో 25, విషమంగా ఉండడంతో ఒకరిని భూపాలపల్లి జిల్లాలోని వంద పడకల ఆస్పత్రికి రెఫర్ చేసినట్లుగా వైద్యాధికారి తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండటం, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఇంటింటా పివర్ సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.