నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని ఖరగ్ ప్రాథమిక పాఠశాల ఇంకా తెరుచుకొని ఖరగ్ పాఠశాల ఎంఈఓ కు సమాచారం లేదట గతేడాది సైతం మూడు నెలలు మూతే అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రికలో నాలుగు రోజుల క్రితం ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. మంగళవారం నాడు ఆగ మేఘాల మీద విద్యాశాఖ అధికారులు ఖరగ్ పాఠశాలకు సంబంధిత ఉపాధ్యాయుడు వెళ్లలేకపోయినా మండల ఎంఆర్పి సిబ్బందిని పంపించి పాఠశాలలను తెరిపించినట్లు మద్నూర్ మండల కేంద్ర ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్లాస్టర్ హెడ్మాస్టర్ అయిన రాజేందర్ సార్ నవతెలంగాణకు తెరిచిన పాఠశాల ఫోటోలు పంపిస్తూ తెలియజేశారు. మద్నూర్ మండలంలో విద్య వ్యవస్థ పట్ల పాఠశాలల కొనసాగింపు పట్ల మండల విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరే ఖరగ్ పాఠశాల గత ఏడాది మూడు నెలలు మూతబడ్డ పాఠశాల గురించి నవతెలంగాణ ప్రచురించిన శీర్షికతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 12న ప్రారంభమైతే ఖరగ్ పాఠశాల తెరుచుకోలేని పాఠశాల గురించి నవ తెలంగాణ మళ్ళీ ప్రచురించే వరకు విద్యాశాఖ అధికారులు కండ్లు తేల్చుకోలేకపోవడం, ఈ మండలంలో విద్య శాఖ ఏ విధంగా పనిచేస్తున్నది అనేదానికి పాఠశాలలు తెరుచుకో లేకపోయినప్పటికీ ఆ విషయాలు నాకు తెలియదు అనే విధంగా మండల విద్యాశాఖ అధికారి సమాధానమివ్వడం విద్యావ్యవస్థ పట్ల నిర్లక్ష్య వైఖరి కారణమని దానికి ఖరగ్ పాఠశాల గత రెండు సంవత్సరాలుగా నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా ఈ మండలంలో ఏ గ్రామంలో ఏ పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు పాఠశాలకు ప్రతిరోజు సమయపాలనతో ఉపాధ్యాయులు వస్తున్నారా లేక డుమ్మలు కొడుతున్నారా పర్యవేక్షించవలసిన విద్యాశాఖ ఏమాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతుందనే ఆరోపణలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ వెనుకబడిన ప్రాంత మద్నూర్ మండలంలో విద్యావ్యవస్థను గాడి తప్పకుండా ముందుకు తీసుకు వెళ్లేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.