అంగన్‌వాడీలపై నిర్బంధాన్ని ఆపాలి

Restrictions on Anganwadis should be stopped–  సమ్మెలో ఉన్న సంఘాలతో చర్చలు జరిపి పరిష్కరించాలి
– రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు
– ఈ నెల 26న ఇందిరాపార్కు వద్ద ధర్నా : అంగన్వాడీ జేఏసీ
నవతెలంగాణ -ముషీరాబాద్‌
సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని వెంటనే ఆపేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. వారిని పర్మినెంట్‌ చేయాలనీ, అప్పటిదాకా కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ పెంపు, తదితర డిమాండ్లను పరిష్కరించా లని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అంగన్‌ వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, అంగన్‌వాడీ యూనియన్‌(ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యన్‌.కరుణకుమారి అధ్యక్షతన కార్మిక, ఉద్యోగ సంఘాల నేతృత్వంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అను బంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి తీర్మా నాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 24న జిల్లా కేంద్రాల్లో కార్మిక, ఉద్యోగ సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమా వేశాలు నిర్వహించనున్నట్టు, 26న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. సమా వేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డీ.యూసుఫ్‌, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బి.విజరుకుమార్‌ యాదవ్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ఎల్‌.పద్మ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌కే బోస్‌, బీఈఎఫ్‌ఐ అధ్యక్షులు సతీస్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు కృష్ణ, మధ్యాహ్న భోజన పథకం యూనియన్‌ రాష్ట్ర నాయకులు ప్రేమ్‌పావని, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్‌రావు, తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డారు. అంగన్‌వాడీలు ట్రేడ్‌ యూనియన్‌ చట్టం 1926 ప్రకారమే చట్టబద్ధంగా 14 రోజుల ముందు ప్రభుత్వానికి, సంబంధిత రాష్ట్ర అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చి పోరాడుతున్నారన్నారు. సమ్మెను పరిశీలించి పరిష్కారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం తగదని హెచ్చరిం చారు. అంగన్‌వాడీలను బెదిరిస్తూ కేంద్రాల తాళాల ను పగులగొట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. అంగన్వాడీలు నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి ప్రభుత్వమే కారణమని నొక్కి చెప్పారు. ఆగస్టు 18న ఐసిడిఎస్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌ అంగన్వాడీ సంఘాలతో జాయింట్‌ సమావేశం నిర్వహించి కొన్ని అంశాలపైనే హామీలిచ్చారన్నారు. వాటికి భిన్నంగా, అతి తక్కువ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు. అంగన్‌వాడీల నుంచి నిరసన తీవ్రంగా రావడంతో కొన్ని జీవోలు, ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నదన్నారు. సమ్మెలో లేని సంఘాలతో మాట్లాడి ఆహా..ఓహో.. అనిపించారన్నారు. అసలు సమ్మెలోనే లేని సంఘా లతో చర్చలు జరపడమేంటని నిలదీశారు. సమ్మెలో ఉన్న సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను సామరస్యపూర్వంగా పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీల పట్ల అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Spread the love