హైదరాబాద్‌లో న్యూ‌ఇయర్ వేడుకలపై ఆంక్షలు

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి 1గంట వరకే ఈవెంట్స్ నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి అని నిర్వహకులకు సూచించారు. 15 రోజుల ముందే కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. తాగి వాహనం నడిపితే రూ.10వేల ఫైన్, 6 నెలలు జైలుశిక్ష విధిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.

Spread the love