అమరావతిలో రాజధాని పనుల పునఃప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతిలో తొలిదశలో రూ. 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఆర్డీయే అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిలో చాలా వరకు పనులను ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో చేపడతారు.

Spread the love