హెచ్‌సీఏ ఎథిక్స్‌ ఆఫీసర్‌గా రిటైర్డ్‌ జడ్జి ఈశ్వరయ్య

హెచ్‌సీఏ ఎథిక్స్‌ ఆఫీసర్‌గా రిటైర్డ్‌ జడ్జి ఈశ్వరయ్యహైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎథిక్స్‌ ఆఫీసర్‌గా విశ్రాంత న్యాయమూర్తి ఈశ్వరయ్య నియమితులయ్యారు. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌సీఏ సెక్రటరీ దేవ్‌రాజ్‌, ఉపాధ్యక్షుడు దల్జీత్‌ సింగ్‌, జాయింట్‌ సెక్రటరీ బసవరాజు, ట్రెజరర్‌ సీజే శ్రీనివాస్‌ రావు, సిఈఓ సునీల్‌ కంటే, రిటైర్డ్‌ జడ్జి ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love