పురుషోత్తంరెడ్డికి రేవంత్‌ రెడ్డి, జంగా ఘన నివాళి

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయప్రతినిధి
కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ మెంబర్‌ వేం నరేందర్‌రెడ్డి సోదరుడు వేం పురుషోత్తంరెడ్డి శనివారం జరిగిన యాక్సి డెంట్‌లో మరణించగా ఆదివారం టీనీపీపీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి హనుమకొండ లోని వేం నరేందర్‌ రెడ్డి స్వగహానికి వెళ్లి వేం పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని అందించారు. వారి వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కార్యకర్తలు ఉన్నారు.

Spread the love