20 ఏళ్లు రేవంత్ రెడ్డినే సీఎం : కోమటిరెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది… రేవంత్ రెడ్డినే సీఎం గా ఉంటారు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఆలోచించినంతగా ఎవరు ఆలోచించరు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమందరం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు అని అన్నారు. అలాగే KCR లాంటి సన్యాసితొ తెలంగాణ రాలేదు. నా లాంటి వ్యక్తి పదవులకు రాజీమానా చేసి దీక్షలు చేస్తే తెలంగాణ వచ్చింది. 175 కోట్లతో కేబుల్ బ్రిడ్జి కట్టి సెల్పిలు దిగితే సరిపోతుందా. సచ్చిన పామును ఎన్ని సార్లు సంపుతాం. బిడ్డ జైలుకు వెళ్లిందని ప్రెస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. అహీ విధంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అందులో మళ్ళీ మేము 135 సీట్లల్లో గెలబోతున్నాము అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Spread the love