రేవంత్‌ రెడ్డి వాఖ్యలు అర్థరహితం

గట్టు రామచంద్రరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచందర్‌రావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. రేవంత్‌ రెడ్డికి సొంత పార్టీలోనే అభద్రత ఉందని విమర్శించారు. బండి కాంగ్రెస్‌ది.. డ్రైవర్‌ టీడీపీవాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు అనే అంశంపై ఇప్పటి వరకు తమ పార్టీలో చర్చించలేదని గుర్తు చేశారు. పొత్తుల విషయాన్ని ఇప్పుడే తేల్చబోమని చెప్పారు.

Spread the love